రేపు (16న) హైదరాబాద్లో ఆటోల బంద్

రేపు (16న) హైదరాబాద్లో ఆటోల బంద్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం (ఫిబ్రవరి 16)న ఆటోల బంద్కు పిలుపు నిచ్చాయి ఆటోడ్రైవర్ల సంఘాలు. మహాలక్ష్మీ పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని , రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్థికంగా చితికిపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్లు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో ‘ఆటోబంద్’ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ణాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటోర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. 
ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో ఆటో బంద్ సంబంధించి తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికలిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు(JAC) రవాణాశాఖ కమిషనర్ ను కలిసి సమ్మె నోటీసులిచ్చారు.