కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు సర్కారు కుట్రలు : సుతారి రాములు

కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు సర్కారు కుట్రలు : సుతారి రాములు

మెట్ పల్లి, వెలుగు: 44 కార్మిక చట్టాలను, లేబర్​ కోడ్ లుగా నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కారు కుట్రలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. బుధవారం మెట్ పల్లి మున్సిపల్ ఆఫీస్ ఎదుట కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 16న దేశంలోని కార్మిక సంఘాలు కలిసి చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె  విజయవంతం చేయాలన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి 700 మంది రైతుల చావుకు కారణమయ్యారని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఉస్మాన్, కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్, శ్రీకాంత్, మధురమ్మ, ఇబ్రహీం, మహేశ్​, శంకరమ్మ పాల్గొన్నారు.