ఇంటర్నేషనల్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో ఆన్సర్ ఇవ్వం

ఇంటర్నేషనల్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో ఆన్సర్ ఇవ్వం

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ వ్యవహారాలపై ట్విట్టర్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క్వశ్చన్స్‌ చేస్తే ఆన్సర్స్‌ ఇవ్వనవసరం లేదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఇండియా–చైనాకు మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం విషయంలో ప్రధాని మోడీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అటాక్ చేశారు.

‘చైనీయులు దేశ సరిహద్దు లోపలికి వచ్చి లడఖ్‌లోని మన భూభాగాన్ని ఆక్రమించారు. అయినా ప్రధాని మోడీ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు’ అని రాహుల్  గాంధీ ట్వీట్ చేశారు. దీనిని ఖండించిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు చెందిన రిటైర్డ్ ఆఫీసర్స్.. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై మంత్రి రవి శంకర్ స్పందించారు. చైనా విషయంలో రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి కౌంటర్ ఇచ్చారు. గతంలో బాలాకోట్ ఎయిర్‌‌స్ట్రయిక్స్, 2016లో జరిగిన ఉరీ అటాక్‌ విషయంలో కూడా రాహుల్ ఇలాగే మాట్లాడారని రవి శంకర్ గుర్తు చేసుకున్నారు.