
యాదాద్రి, వెలుగు : 24 గంటల కరెంట్ఇస్తే నేను రాజీనామా చేస్తనన్న. ఇయ్యకుంటే నువ్వు రాజీనామా చెయ్యాలని చెప్పిన. మీరు 11 గంటలే కరెంట్ ఇస్తున్నరని తేలింది. కేటీఆర్.. ఇప్పుడేం జవాబు చెప్తవ్” అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరి మం డలం బండ సోమారంలో సబ్‌స్టేషన్‌ను సందర్శించారు.
అక్కడి ఆపరేటర్ బాల్ నర్సయ్యతో మాట్లాడి.. పవర్ సప్లయ్బుక్ తెప్పించుకుని పరిశీలించారు. అందులో రికార్డు చేసిన ప్రకారం.. రోజుకు 11 గంటల త్రీఫేజ్కరెంట్సప్లయ్ చేస్తున్నారని తేలింది. యూఎస్‌లో ఎన్ఆర్ఐ తెలిసీ తెలియక వేసిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి తెలిసీ తెలియకుండా జవాబిచ్చారని వెంకట్‌రెడ్డి అన్నారు.