
చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఒంటిళ్లు గ్రామం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఇవాళ ఉదయం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ బాలింత అక్కడిక్కడే మృతి చెందింది. కున్నూతల నుంచి చికిత్స కోసం తిరుపతికి వెళ్తుండగా బాలింత ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అంజలి(32) అక్కడికక్కడే మృతి చెందిందగా.. ఆమె బిడ్డతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు అంజలి స్వస్థలం కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం కున్నూతలం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.