
హైదరాబాద్, వెలుగు : నిమ్స్‌లో ఇప్పటిదాకా వంద రోబోటిక్ సర్జరీలు పూర్తయ్యాయని డైరెక్టర్, డాక్టర్ బీరప్ప ప్రకటించారు. గతేడాది జులై నుంచి రోబోటిక్ సర్జరీలు ప్రారంభించామని గుర్తుచేశారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో 35, యూరాలజీలో 48, సర్జికల్ ఆంకాలజీలో17 సర్జరీలు పూర్తి చేశామన్నారు. ఈ మూడు విభాగాల డాక్టర్లు అత్యంత సంక్లిష్టమైన చికిత్సలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారని వివరించారు.
ఈ క్రమంలో యురాలజీ డాక్టర్లు ప్రొఫెసర్ రాహుల్ దేవ్ రాజ్ , ప్రొఫెసర్ రాంరెడ్డి , డా.విద్యాసాగర్ , సర్జికల్ ఆంకాలజీ హెచ్‌వోడీ రాజశేఖర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ వేణు మాధవ్, డాక్టర్ వర్మ, అనస్థీషియా ప్రొఫెసర్ నిర్మల, నర్సింగ్, ఇతర సిబ్బందిని బీరప్ప అభినందించారు.