చెట్టు కొట్టినందుకు లక్ష ఫైన్, క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు

చెట్టు కొట్టినందుకు లక్ష ఫైన్, క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు

షాపు ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడుకలకు అడ్డుగా ఉందని చెట్టు కొట్టేసిన ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం లక్ష రూపాయల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించడంతోపాటు, క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు చేశారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో కొత్తగా రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఓపెనింగ్ సందర్భంగా అడ్డంగా ఉందని షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదురుగా ఉన్న చెట్టును కొట్టేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి అమయ్ కుమార్ ఆదేశాల మేరకు లక్ష రూపాయల పెనాల్టీ విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తెలిపారు. ఫారెస్ట్  డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటు ఆఫీసర్లు సంబంధింత షాప్ యజమానిపై క్రిమినల్ కేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నమోదు చేసినట్లు తెలిపారు.