100 రోజులు.. లక్ష మరణాలు

100 రోజులు.. లక్ష మరణాలు

16.75లక్షలకు చేరిన పాజిటివ్ కేసులు
మొత్తం 177 దేశాలకు పాకిన మహమ్మారి
16.75 లక్షలకు చేరిన పాజిటివ్ కేసులు
కోలుకున్నవాళ్లు 3.71 లక్షల మంది

న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు పాకింది . శుక్రవారం నాటికి అన్ని దేశాల్లో కలిపి కరోనాతో చనిపోయినవారి సంఖ్య 1,01,500కు చేరింది . రోజూ వేలాది మంది చనిపోతున్నారు. గురువారం ఒక్క అమెరికాలోనే 1600 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 16.75 లక్షలకు చేరాయి. ఇప్పటిదాకా 3.71 లక్షల మంది కోలుకున్నారు.

మందులు, కిట్లపై 69 దేశాల బ్యాన్
కరోనా వైరస్ హద్దులు లేకుండా దేశదేశానికీ పాకింది. కానీ ఆయా దేశాలు హద్దులు గీసుకోవడంతో పేద దేశాలకు ఈ విపత్తు నుంచి బయటపడే దారి కనిపించడం లేదు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రతి దేశానికీ అవే మందులు కావాలి. అవే మెడికల్ ఎక్విప్ మెంట్స్, కిట్లు కావాలి. దాదాపుగా 69 దేశాలు కరోనా ట్రీట్ మెంట్ కు కావాల్సిన మందులు, ఎక్విప్ మెంట్స్, కిట్ల ఎగుమతులపై బ్యాన్ పెట్టాయి. దీంతో చాలా దేశాలు కరోనాపై పోరాటంలో చతికిలబడుతున్నాయని అంతర్జాతీయ హెల్త్ ఎక్స్ పర్ట్లు అంటున్నారు. సంపన్న దేశాలు ఈ విషయంలో జాతీయవాదం
పక్కన పెట్టి మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నాయి.

ఇది ఒక తరం చేస్తున్న యుద్ధం: ఐరాస చీఫ్
కరోనా విపత్తు ‘ఒక తరం చేస్తున్న యుద్ధం ’ అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ఈ విపత్తు ప్రపంచ శాంతిభద్రలకు ముప్పుగా మారిందన్నారు. కరోనా విపత్తు ముప్పును సెక్యూరిటీ కౌన్సిల్ తక్కువగా అంచనా వేసిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆంటోనియో మాట్లాడారు. యూఎన్ ఏర్పడినప్పటి నుంచి 75 ఏండ్లలో ఇంత క్లిష్ట పరిస్థితి ఎన్నడూ రాలేదని, ఇంటర్నేషనల్, రీజనల్, నేషనల్ సంక్షోభాలను నివారించే ప్రయత్నంచేసేందుకు ఇప్పటికే దారులు మూసుకుపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో ప్రపంచ శాంతి, భద్రతల మెరుగుదలకు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పాత్ర చాలా కీలకమన్నారు.

న్యూయార్క్లో కరోనాతో చనిపోయిన వారిని హార్ట్ ఐలాండ్లో అధికారులు సామూహికంగా సమాధి చేస్తున్నరు. ప్రొక్లెయినర్లతో పెద్దగుంత
తవ్వి వందలకొద్దీ శవపేటికలను ఇలా పూడ్చిపెడుతున్నరు. దేశం మొత్తమ్మీద కరోనా మృతుల సంఖ్య న్యూయార్క్ లోనే ఎక్కువగా ఉండడంతో డెడ్ బాడీలను ఖననం చేయడం బాగా ఆలస్యమవుతోంది. కనీసం 14 రోజుల పాటు అధికారులు వాటిని స్టోర్ చేస్తున్నారు.

యూఎస్‌‌‌‌లో ఒక్కరోజే 1,600 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వల్ల ఒక్కరోజులోనే 1600 మంది చనిపోయారు. గురువారం కొత్తగా 27 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4.89 లక్షలకు చేరగా, 18,000 మంది వైరస్ కు బలైపోయారు. కరోనా ఈ వారం పీక్ స్టేజీకి చేరుకుంటుందని, దీంతో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. న్యూయార్క్ లో అత్యధికంగా 1.71 లక్షల కేసులు, 7,850కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే రోజూ ఐదారు వందల మంది చనిపోతున్నారు.

For More News..

మందు డోర్​ ​డెలివరీ​పేరిట​ భారీగా​ మోసాలు

నో​ కాంటాక్ట్​,​ నో​ ట్రావెల్​​ హిస్టరీ.. అయినా​ కరోనా​ ఎటాక్

5 రోజుల్లోనే 3 వేల కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కట్టడిలో లక్షల జనాభా

నిత్యావసర సరుకుల కోసం జనం తిప్పలు