ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగించారు. ఈనెల 31 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈ ఒక్క వారం ప్రజలు సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. 31 నుంచి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అయితే ఒకేసారి అన్ లాక్ చేయలేమని.. కొన్ని నిబంధనలను మెళ్లిమెల్లిగా  ఎత్తివేస్తామన్నారు. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం, వ్యాక్సిన్ కంపెనీలతో చర్చిస్తున్నామని, వ్యాక్సినేషన్ ఆలస్యం అయితే మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందన్నారు. 

'దాదాపు నెల రోజుల లాక్ డౌన్ తో వైరస్ ప్రభావం క్రమేణా తగ్గుతున్నట్లు కన్పిస్తోంది. కానీ ఇంకా కరోనా ఖతర్నాక్ గానే ఉంది. వైరస్ వ్యాప్తి  చాలామటుకు తగ్గింది. రోజు వారీ కేసుల సంఖ్య 28 వేల నుంచి ప్రస్తుతం 1,600కు తగ్గింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి కరోనాపై విజయం సాధిస్తాయని నమ్ముతున్నా' అని కేజ్రీవాల్ వివరించారు.