కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెగడంతో వరద ఉధృతికి గల్లంతైన 19వ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు
  • నదీ తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • తాత్కాలిక గేట్ ఏర్పాటుకు నిపుణులను పిలిపించిన కర్నాటక ప్రభుత్వం

అయిజ, వెలుగు: కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరదలకు కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని హోస్పేట వద్ద నిర్మించిన ఈ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో 19వ గేటు కనిపించకపోవడంతో అధికారులు కంగారు పడ్డారు. వరద ఉధృతికి చైన్ లింక్ తెగి గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గేటు కొట్టుకుపోవడంతో 75 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు వెళ్తున్నాయి. వరద ఉధృతి ఒత్తిడి ఒకే గేటు మీద పడకుండా ఉండేందుకు డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం గేట్లు 20 అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన నిపుణుల బృందం డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలిస్తుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, కనీసం 70 టీఎంసీల నీళ్లు ఖాళీ చేస్తేనే తాత్కాలిక గేటు అమర్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో దిగువకు నీళ్లు వదులుతుండటంతో కర్నాటకలోని బళ్లారి, కొప్పళ, విజయనగర, రాయచూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలకు వచ్చే రబీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాగు నీటికి, ఆయా జిల్లాల పరిధిలోని 30 గ్రామాలకు తాగు నీటి సరఫరాకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. 

డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన కర్నాటక డిప్యూటీ సీఎం..
తుంగభద్ర డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శించారు. గేటు కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న ఆయన.. ఆదివారం డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. వీలైనంత త్వరగా తాత్కాలిక గేటు ఏర్పాటు చేయాలని డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు, నిపుణులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని వారిని అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు.

ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తం.. 
తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నాటక ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఆదివారం వరద నీరు గద్వాల జిల్లాలోని అయిజ, రాజోలి, వడ్డేపల్లి, మానవపాడు మండలాల నదీ పరివాహక గ్రామాలకు చేరే అవకాశం ఉంది. అలాగే, వరద నీరు ఆర్డీఎస్ ఆనకట్ట మీదుగా అయిజ మండలంలోని కుట్కనూరు వద్ద తెలంగాణ బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించి పులికల్, నాగులదిన్నె బ్రిడ్జి మీదుగా రాజోలి సమీపంలో ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుకొనున్నది. తర్వాత అలంపూర్ మండలంలోని గొందిమల్ల గ్రామం వద్ద కృష్ణా నదిలో కలిసి శ్రీశైలం జలాశయానికి చేరుకుంటాయి. ఇప్పటికే నదిలో స్వల్ప వరద ఉండగా గేటు కొట్టుకుపోవడంతో వచ్చే వరదతో సుంకేసుల బ్యారేజీకి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నదీ తీర గ్రామాల ప్రజలు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 70 ఏళ్ల డ్యామ్ చరిత్రలో ఇదే అతి పెద్ద దుర్ఘటన అధికారులు పేర్కొంటున్నారు.