జూబ్లీహిల్స్‌లో బైకు ప్రమాదం.. యువకుడు మృతి

జూబ్లీహిల్స్‌లో బైకు ప్రమాదం.. యువకుడు మృతి

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యవకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ఉదయం ఓ యువకుడు బైక్‌పై రోడ్ నెంబర్ 10 మీదుగా వెళ్తున్నాడు. మితిమీరిన వేగంతో వెళ్తున్న యువకుడి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడి తలకు తీవ్రగాయాలవడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

For More News..

విజయవాడలో మళ్లీ లాక్డౌన్

హరీశ్ రావుపై పోలీసులకు ఫిర్యాదు

సెకెండ్ హ్యాండ్‌ కార్లకు ఫుల్​ గిరాకీ

మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్