చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి.. జడ్చర్ల నాగసాల చెరువులో ఘటన

చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి.. జడ్చర్ల నాగసాల చెరువులో ఘటన

జడ్చర్ల, వెలుగు :  మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టౌన్ శివారులోని నాగసాల చెర్వులో పడి ఒకరు మృతిచెందారు. కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి గణపతి(45) శుక్రవారం సాయంత్రం చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లాడు.  ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు.  జడ్చర్ల పోలీసులకు  సమాచారం అందడంతో వెళ్లి డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం జడ్చర్ల ఆస్పత్రికి  తరలించారు.  మృతుడి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ జయప్రసాద్​తెలిపారు.