అశోక్ గెహ్లాట్ కు షాకిచ్చిన రాహుల్ గాంధీ

అశోక్ గెహ్లాట్ కు షాకిచ్చిన రాహుల్ గాంధీ

కొచ్చి: కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ కీలక కామెంట్లు చేశారు. ‘పార్టీలో ఒక్క వ్యక్తికి ఒక్క పదవి’ అనే నియమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం కొచ్చిలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయంమేరకు ‘‘వన్ మ్యాన్ - వన్ పోస్టు’’ రూల్ అమలవుతుందా? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ఉదయ్ పూర్​లో మేం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని ఆశిస్తున్నాం” అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కేవలం పోస్టు మాత్రమే కాదన్నారు.

ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి కొన్ని విషయాలను గుర్తించుకోవాలన్నారు. ‘‘అది చరిత్రాత్మక స్థానం. ఆ పోస్టు కొన్ని ఐడియాలు, నమ్మకమైన వ్యవస్థ, దేశ విజన్​కు నిదర్శనం” అని చెప్పారు.
గెహ్లాట్ కామెంట్ల నేపథ్యంలో... రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సీఎంగా ఉంటూనే ప్రెసిడెంట్​గా పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక్కరికి ఒక్క పదవేనన్న రాహుల్ కామెంట్ చర్చనీయాంశమైంది.