సచిన్ కొట్టిన సిక్స్‌ను గుర్తుచేసుకున్న పాకిస్తాన్ బౌలర్…

సచిన్ కొట్టిన సిక్స్‌ను గుర్తుచేసుకున్న పాకిస్తాన్ బౌలర్…

2003 ప్రపంచకప్ లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తన బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ను గుర్తు చేసుకున్నారు పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. సెంచూరియన్‌లో భారత్ పాకిస్తాన్ తో తలపడిన మ్యాచ్ లో అక్తర్ వేసిన షార్ట్‌ పిచ్‌ బాల్‌ను థర్డ్‌ మ్యాన్‌ దిశగా సిక్స్‌  గా మలిచిన తీరు అద్భతమని కొనియాడారు.  అయితే ఆ సిక్స్‌ను భారత ప్రజలు ఎంతగానో ఆస్వాదిస్తారని తెలిసిందని అన్నారు…  ఈ విషయం అప్పుడే తెలిసివుంటే ప్రతీసారి తాను ఒక సిక్స్‌ను సచిన్‌కు సమర్పించుకునే వాడిననని అన్నారు.

సచిన్ తనకు మంచి స్నేహితుడని, నిగర్వి అని అక్తర్ తెలిపారు. తన సహచర ప్లేయర్లతో కూడా సచిన్ మసులుకునే తీరు చాలా బాగుంటుందని అన్నాడు.   మైదానంలో మాత్రం తమ శక్తినంతటినీ ఉపయోగించి ఒకరిని మరొకరం ఎదుర్కునే వాళ్లమని చెప్పారు. ప్రపంచం గర్వించదగ్గ ఆటగాళ్లలో సచిన్ ఒకరని తెలిపారు. తాను సచిన్‌ను 12-13 సార్లు అవుట్ చేశానని అన్నారు అక్తర్. అయితే సెంచూరియన్‌లో భారత్ 274పరుగులను చేధించే క్రమంలో సచిన్ 98పరుగులు చేసి తన బౌలింగ్‌లోనే అవుట్ అయ్యడని తెలిపారు. ఆ మ్యాచ్ లో సచిన్ రెండవ ఓవర్ నుంచి తన దూకుడును ప్రదర్శించాడని చెప్పారు.