ఓయూ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి వెంటనే రూ.1,000 కోట్లు రిలీజ్చేయాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్కల్వకుంట్ల కవిత డిమాండ్చేశారు. మాటలు చెప్పిపోయిన సీఎం.. తిరిగి యూనివర్సిటీని చూడలేదని విమర్శించారు.
ఓయూలోని ఈ1 హాస్టల్లో నెలకొల్పిన గణేశుడిని గురువారం రాత్రి ఆమె దర్శించుకున్నారు. అనంతరం హాస్టల్విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెస్ సౌకర్యం లేక లా స్టూడెంట్స్10 నెలలుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని అన్నారు.
వారికి కనీసం మంచినీటి సౌకర్యం లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. వర్సిటీలో పాముల సమస్య ఉందని, డిస్పెన్సరీ కొంత సమయం వరకే పని చేస్తోందని తెలిపారు. అర్ధరాత్రి ఏదైనా జరిగితే 3 కిలోమీటర్లు పరిగెత్తాల్సిన పరిస్థితి బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
