మిత్సుయ్లో ఓఎన్జీసీకి వాటా

మిత్సుయ్లో ఓఎన్జీసీకి వాటా

న్యూఢిల్లీ: ఓయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్​జీసీ) జపాన్ కు చెందిన మిత్సుయ్ ఓఎస్​కే లైన్స్ సంస్థతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. దీనిలో భాగంగా రెండు భాగస్వామ్య కంపెనీల్లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ సంస్థలు అతిపెద్ద ఈథేన్ రవాణా నౌకలను (వీఎల్ఈసీ) కలిగి ఉండటమే కాకుండా, వాటి కార్యకలాపాలను కూడా నిర్వహిస్తాయి. 

దేశీయ ఇంధన అవసరాలను తీర్చడంతో పాటు గ్యాస్ దిగుమతుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ నౌకల ద్వారా ఈథేన్ గ్యాస్​ను సులభంగా రవాణా చేసే వీలు కలుగుతుంది. ఇంధన సరఫరా గొలుసులో పట్టు సాధించడానికి ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం తోడ్పడుతుందని కంపెనీ ఆశిస్తోంది. దీనివల్ల ఓఎన్జీసీ తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.