ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తగ్గినట్లే తగ్గి మళ్లీ యధావిధికి

 ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తగ్గినట్లే తగ్గి మళ్లీ యధావిధికి
  • ఇవాళ ఒక్కరోజే 20 వేల 345 కొత్త కేసులు నమోదు.. మరణాలు: 108

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజు ఆరువేలకు పైగా కేసులు తగ్గడం కొంత ఊరట కలిగించగా.. మళ్లీ పెరగడంతో పరిస్థితి యధావిధికి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 86,878 నమూనాలను పరీక్షించగా 20 వేల 345 పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. అలాగే 108 మంది కోలుకోలేక చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య  13 లక్షల 22 వేల 934కి చేరింది. అలాగే కరోనా నుంచి 11 లక్షల 19 వేల 933 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 95 వేల 102 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 8 వేల 899 మంది మృతి చెందారు. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 75లక్షల 14వేల 937 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు.. మరణాలు
చిత్తూరు జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగించింది. రుయా ఆస్పత్రిలోనే ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో నిమిషాల వ్యవధిలో 11 మంది కన్ను మూశారు. గడచిన 24 గంటల్లో ఏకంగా 18 మంది చనిపోయారు. అలాగే విశాఖలో 12 మంది, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పది మంది చొప్పున, ప్రకాశం జిల్లాలో 9 మంది, నెల్లూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. 
జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే గడచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 1992 మందికి కరోనా నిర్ధారణ కాగా చిత్తూరు జిల్లాలో 2426 మందికి, తూర్పు గోదావరి జిల్లాలో 1527మందికి, గుంటూరులో 1919 మందికి, కడప జిల్లాలో 1902 మందికి, కృష్ణా జిల్లాలో 948 మందికి, కర్నూలు జిల్లాలో 707 మందికి, నెల్లూరు జిల్లాలో 1673 మందికి, ప్రకాశం జిల్లాలో 1130 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 1457 మందికి, విశాఖపట్టణంలో 2371 మందికి, విజయనగరంలో 744మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1549 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.