మూసీ నదికి వరద.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం

మూసీ నదికి వరద.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం

నల్లగొండ జిల్లా: మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మూసీ ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా  ప్రస్తుత నీటిమట్టం 643 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్ధ్యం  4.46 టీఎంసీలు కాగా..  ప్రస్తుతం నీటి సామర్థ్యం 4.09 టీఎంసీలు ఉంది. నదిలో వరద ఇన్ ఫ్లో  299.81 క్యూసెక్కులు కొనసాగుతోంది.  ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతుండడంతో వరద పెరిగితే ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని నది పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.