సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్ని కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు

సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్ని కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు

హైద‌రాబాద్: కాలీజీల్లో ఆన్ లైన్ క్లాసుల‌పై క్లారిటీ ఇచ్చింది ఉన్న‌త విద్యా మండ‌లి. రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ 1 నుంచి  (డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్, వృత్తి విద్యా కోర్సుల )అన్ని కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని మంగ‌ళ‌వారం ఉన్న‌త విద్యా మండ‌లి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆగ‌స్టు 27 నుంచి డ్యూటీల‌కు హాజ‌రుకావాల‌ని లెక్చ‌ర‌ర్ల‌కు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్ర‌కారం డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని క్లారిటీ ఇచ్చింది.

ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 1 నుంచి ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అవసరమైన ఈ-కంటెంట్ పాఠ్య ప్రణాళికకు సిద్ధం కావాలి. పాఠశాలలు తిరిగి తెరవడం, సాధారణ తరగతుల ప్రారంభానికి సంబంధించి భారత ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిసింది. తదుపరి ప్రభుత్వ నిర్ణయం వరకు అన్ని పాఠశాలలు విద్యార్థుల కోసం మూసివేయబడే ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్న విష‌యం తెలిసిందే.