ఆన్‌లైన్‌ డేటింగ్‌ గ్యాంగ్ అరెస్ట్

ఆన్‌లైన్‌ డేటింగ్‌ గ్యాంగ్ అరెస్ట్

ఆన్ లైన్ డేటింగ్ తో యువకులకు వల
అరెస్టైన అమ్మాయిలు…
ఒక్కొక్కరినుంచి లక్షల్లో వసూలు

ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ద్వారా మువకులను ట్రాప్ చేస్తున్న అమ్మాయిలను అరెస్ట్ చేశారు పోలీసులు.  కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న ముఠా.. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం యువకులను ట్రాప్ చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవడంతో సీఐ గోపీనాథ్ నేతృత్వంలోని టీం కోల్ కతా వెళ్లి దర్యాప్తు చేసింది. దీంతో సదరు వెబ్ సైట్ నిర్వహిస్తున్న 26మంది అమ్మాయిలను లోకల్ పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖ పట్నంలో ఉన్న యువకులను టార్నెట్ చేసినట్లు తెలిపారు. విశాఖ లో ఒకరినుంచి 18లక్షలు, మరొకరి నుంచి 3 లక్షలు తీసుకున్నట్లు చెప్పారు. వీరినుంచేకాక మరికొంత మంది నుంచి కూడా మనీ వసూలు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. వీరినుంచి.. 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ కోల్‌కతా కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.