
కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్ మహిళ మెడికల్ ఆఫీసర్లను లైంగికంగా వేధించిన విషయంలో విచారణ అనంతరం అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కొంతమంది మహిళా డాక్టర్లు తమను డీఎంహెచ్‌వో వేధిస్తున్నాడని హెల్త్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులకు కలెక్టర్, ఎస్పీలకు సైతం ఫిర్యాదులు అందజేశారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాగా కామారెడ్డి డీఎంహెచ్ వో పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐదుగురు మహిళా డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డీఎంహెచ్ వో పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.