ఆన్​లైన్​ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ. 41 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు 

ఆన్​లైన్​ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ. 41 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు 

సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లాలో నకిలీ ఆన్​లైన్​ట్రేడింగ్ పేరుతో భారీ మోసం జరిగింది.  పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ చెందిన బ్యాటరీల వ్యాపారస్తుడు సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ లింకు ఓపెన్ చేసి తన వివరాలు నమోదు చేసుకున్నాడు. తన వివరాలతో ఒక ఐడి క్రియేట్ చేశాడు.   సైబర్​ కేటుగాళ్లు రూ. 94 లక్షల కమీషన్ ను ఆశగా చూపెట్టడంతో దఫాల వారీగా రూ. 41 లక్షల పెట్టుబడి పెట్టాడు . అనంతరం కమీషన్​ను  డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ట్రేడింగ్ సంస్థ స్పందించలేదు. దీంతో తాను  మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.