కొన్ని వీసా కార్డ్ పేమెంట్స్‌‌కు అనుమతి లేదు

కొన్ని వీసా కార్డ్  పేమెంట్స్‌‌కు అనుమతి లేదు

న్యూఢిల్లీ: లీగల్ అనుమతులు లేకుండా చేస్తున్న పేమెంట్స్‌‌ విధానాలను  తాత్కాలికంగా నిలిపివేయాలని కార్డ్ నెట్‌‌వర్క్‌‌ కంపెనీలను ఆర్‌‌‌‌బీఐ ఆదేశించింది.  కార్డ్ పేమెంట్స్ అంగీకరించని  సంస్థలకు ఇంటర్మీడియట్ల ద్వారా కార్డ్ పేమెంట్స్ జరిగేలా వీసా కొన్ని విధానాలను ఫాలో అవుతోంది. ఈ విధానంలో ఇంటర్మీడియట్లు కార్పొరేట్ల నుంచి  కార్డ్‌‌ పేమెంట్‌‌ను అంగీకరిస్తారు. తర్వాత ఐఎంపీఎస్‌‌, ఆర్‌‌‌‌టీజీఎస్‌‌, నెఫ్ట్ ద్వారా కార్డ్ పేమెంట్స్ అంగీకరించని సంస్థలకు పంపుతారు.    ఈ విధానాలు కూడా పేమెంట్‌‌ సిస్టమ్‌‌ కిందకి వస్తాయని, పేమెంట్ అండ్ సెటిల్‌‌మెంట్ సిస్టమ్స్ చట్టం కింద ఇలాంటి పేమెంట్స్‌‌కు అనుమతి తప్పనిసరి అని ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది. ఇటువంటి యాక్టివిటీస్‌‌కు లీగల్ అనుమతులు లేవని పేర్కొంది. ఆర్‌‌‌‌బీఐ వీసా కార్డ్ పేరును బయట పెట్టలేదు. కానీ, మనీకంట్రోల్ ఈ విషయాన్ని పబ్లిష్ చేసింది. కాగా, కమర్షియల్‌‌ , బిజినెస్ పేమెంట్స్‌‌లో బిజినెస్ పేమెంట్‌‌ సొల్యూషన్ ప్రొవైడర్ల (పీపీఎస్‌‌పీ) పాత్రను  తెలపాలని వీసా, మాస్టర్‌‌‌‌కార్డ్‌‌ను ఆర్‌‌‌‌బీఐ అడిగిన విషయం తెలిసిందే.