డిగ్రీ లెక్చరర్స్ కు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలి

డిగ్రీ లెక్చరర్స్ కు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలి
  • డిగ్రీ లెక్చరర్స్ కు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలి
  • తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల ఉద్యోగుల సంఘం

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్స్ ఏండ్లుగా ఎదురుచూస్తుండగా..  ప్రిన్సిపల్స్ గా  పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణికి తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డా. శారద, ప్రధాన కార్యదర్శి డా. సత్య శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గత 30 ఏండ్లుగా సొసైటీలో ఎన్నో ఇబ్బందులను తట్టుకొని విద్యార్థులకు విద్యనందిస్తుండగా.. డిగ్రీ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్ గా ప్రమోషన్లు  ఇవ్వాలని నిర్ణయించడం శుభపరిణామం అని పేర్కొన్నారు.