
బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులతో రాజకీయాలు చేయాలని చూస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంటట్ రెడ్డి. తాము మంచి చేయాలని చూస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ నిరుద్యోగుల గురించి ఎప్పుడు మాట్లాడలేదని ఇప్పుడు డీఎస్పీ ద్వారా నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే తప్పు దారి పట్టిస్తున్నారని విమర్శించారు. పాలమూరు, కొడంగల్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే వాటిని పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాలుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని మిగిలినవారంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పారు.
కరీంనగర్ లో ఓడిపోతానని తెలిసి కేసీఆర్ మహబూబ్ నగర్ నీటిని కరీంనగర్ కు తరలించాడని ఆరోపించారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు తీరని అన్యాయం చేశారన్నారు. ఫ్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాం కు కేసీఆర్ తెరతీశారని అన్నారు. హరీష్ రావు, కేటిఆర్ లు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మహబుబ్ నగర్ కు మంచి రోజులు తెస్తామని చెప్పారు.
Also Read :- రైతుల రూ.2 లక్షల రుణమాఫీ
ఎవరెన్ని చేసినా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే ముందుకు వెలుతున్నామన్నారు. కొడంగల్ కు బీఆర్ఎస్ నిధులు ఇవ్వలేదని కానీ ఈరోజు కొడంగల్ కు వరాల జల్లు కురుస్తోందని చెప్పారు. కేసీఆర్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నామని చేసిన తప్పు కు అందరూ శిక్ష అనుభవించాల్సిందేనని రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.