మెరిట్ క్యాండిడేట్లకే ఉద్యోగాలివ్వాలి

మెరిట్ క్యాండిడేట్లకే ఉద్యోగాలివ్వాలి

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు మెరిట్ ప్రాతిపదికనే ఉండాలని, ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లను పక్కనపెట్టి తక్కువ మెరిట్ ఉన్నోళ్లకు ఉద్యోగాలివ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీం కోర్టు చెప్పింది. జార్ఖంఢ్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సై నియామకాలపై దాఖలైన పిటిషన్​పై  జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఇందిరా బెనర్జీతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. జార్ఖండ్‌ సర్కారు 2008లో ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 382 మందిని అపాయింట్ చేసింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ సెలక్ట్ కాని 43 మంది వేసిన పిటిషన్ మేరకు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారికి ఉద్యోగాలిచ్చింది. దీంతో పోస్టింగ్ లు కోల్పోయిన మొదట సెలక్ట్ అయిన 43 మంది కోర్టును ఆశ్రయించారు.