వాళ్లకు వాళ్లే సాటి : చంద్రయాన్ 3కు.. పోటీగా పాకిస్తాన్ ప్రయోగం ఇదే

వాళ్లకు వాళ్లే సాటి : చంద్రయాన్ 3కు.. పోటీగా పాకిస్తాన్ ప్రయోగం ఇదే

అంతరిక్ష ప్రయోగాలలో  ఇండియా రోజురోజుకూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.2023 జూలై 14న ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చంద్రయాన్ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.  మరి ఇండియా ఏదైనా ఘనత సాధిస్తే పాకిస్థాన్‌ను చూస్తూ ఎలా ఉంటుంది. ఉండదు కదా..  ఇండియా చంద్రయాన్‌ను ప్రయోగించినప్పుడు, పాకిస్తాన్ కూడా తన ప్రయోగాన్ని ప్రయోగించింది. 

ఇది చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఇది పాకిస్తాన్ యొక్క చంద్రయాన్ ప్రయోగంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చాలా మంది  రాకెట్ ఆకారంలో  ఉన్న గాలి బుడగలు ఊదుతూ కనిపించారు. ఇది పాకిస్తాన్‌కు చెందిన రాకెట్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  భారత్‌కు పోటీగా పాకిస్థాన్ చంద్రయాన్ ప్రయోగం అని వీడియో  క్యాప్షన్‌లో రాసింది.  ఈ వీడియో పైన  చాలా మంది చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇది పాకిస్తాన్ యొక్క అసాధ్యమైన మిషన్ అని ఒక వ్యక్తి కామెంట్ చేయగా,  పాకిస్థాన్ చంద్రయాన్ ఇలా ఉండవచ్చని మరొకరు రాశారు. చంద్రునిపై పాకిస్థాన్‌కు చెందిన చంద్రయాన్‌ను ఉగ్రవాదులు మాత్రమే పంపించగలరని మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  పాకిస్తాన్ GDPలో సగం దీనిని తయారు చేయడానికి ఖర్చు చేసి ఉంటారని సెటైర్లు, మీమ్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి.