
ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే అని.. ఈ ఆపరేషన్ తో భారతదేశానికి విజయం అలవాటుగా మారిందని అన్నారు రాజ్ నాత్ సింగ్. శనివారం ( అక్టోబర్ 18 ) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి లక్నో లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్ ను జెండా ఊపి ప్రారంభించారు రాజ్ నాథ్ సింగ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్.
ఇండియా శక్తికి బ్రహ్మోస్ ఒక చిహ్నం అని అన్నారు రాజ్ నాథ్ సింగ్. బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదని.. ఇది ఇండియా యొక్క వ్యూహాత్మక శక్తికి నిదర్శనమని అన్నారు. సైన్యం నుండి వైమానిక, నావికాదళం వరకు ఇది ఇండియా రక్షణ దళాలకు కీ పిల్లర్ గా మారిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్.పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి ఇంచ్ బ్రహ్మోస్ పరిధిలో ఉందని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు రాజ్ నాథ్ సింగ్.
►ALSO READ | రైలు ప్రయాణికులకు దీపావళి గిఫ్ట్: కేరళ నుండి రామేశ్వరానికి స్పెషల్ రైలు ప్రారంభించన రైల్వే..
ఆపరేషన్ సిందూర్ తో ఇండియా పవర్ ఏంటో పాకిస్తాన్ కు తెలిసొచ్చిందని అన్నారు. పాకిస్తాన్ సృష్టించగలిగిన ఇండియా.. సమయం వస్తే ఏం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. అవసరమైతే పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలు చేస్తామంటూ పరోక్షంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్.
ఆపరేషన్ సిందూర్ ఇండియన్స్ లో కొత్త విశ్వాసాన్ని కలిగించిందని.. ప్రపంచానికి బ్రహ్మోస్ ప్రభావాన్ని చూపించిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నాశనం చేయడానికి ఇండియా ఉపయోగించిందని అన్నారు. పాక్ రాడార్లకు దొరకకుండా వారి స్థావరాలను నాశనం చేసిందని అన్నారు రాజ్ నాథ్ సింగ్.