
ప్రస్తుతం తిరువనంతపురం నుండి మధురై మధ్య నడుస్తున్న అమృత ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు రామేశ్వరం వరకు పొడిగించారు. ఈ కొత్త సర్వీస్ గురువారం నుండి నుండి అమల్లోకి వచ్చింది, దింతో కేరళ నుండి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం చేరుకునే ఏకైక రైలు అమృత ఎక్స్‌ప్రెస్.
ఈ కొత్త సర్వీస్ ఎప్పటి నుండి: ఈ పొడిగించిన సర్వీస్ అక్టోబర్ 16న ప్రారంభమైంది. రైలు నంబర్ 16343 తిరువనంతపురం నుండి రాత్రి 8:30 గంటలకు బయలు దేరి తరువాత రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. రామేశ్వరం నుండి మళ్ళీ రైలు నంబర్ 16344తో మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి తరువాత రోజు ఉదయం 4:55 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.
రూట్, టైమింగ్స్: అమృత ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ నడుస్తుంది. కొట్టాయం, త్రిస్సూర్, పాలక్కాడ్, పళని, దిండిగల్ నుండి వెళుతుంది.
రామేశ్వరం వెళ్ళేటప్పుడు:
ఉదయం 9:50 గంటలకు మధురై, 10:25 గంటలకు మనమదురై, 10:50 గంటలకు పరమకుడి, 11:13 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. తిరుగు వచ్చేటప్పుడు మధ్యాహ్నం 2:13 గంటలకు రామనాథపురం, 2:38 గంటలకు పరమకుడి, 3:05 గంటలకు మనమదురై, సాయంత్రం 4:05 గంటలకు మధురై చేరుకుంటుంది. తిరువనంతపురం నుండి మధురై మధ్య ఈ ప్రస్తుత టైమింగ్స్ ఎప్పటికి ఇలాగే ఉంటుంది.
ఏ సౌకర్యాలు ఉంటాయంటే : ఈ రైలులో 12 స్లీపర్ కోచ్‌లు, నాలుగు జనరల్ కోచ్‌లు, మూడు ఎసి త్రీ-టైర్ కోచ్‌లు, రెండు ఫస్ట్ ఎసి & సెకండ్ ఎసి కోచ్‌లు ఉంటాయి.
పంబన్ బ్రిడ్జ్ ప్రారంభమైన తర్వాత అమృత ఎక్స్‌ప్రెస్ రైలును రామేశ్వరం వరకు పొడిగిస్తామని భారత రైల్వే గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిడ్జ్ ప్రారంభించబడినప్పటికీ, సర్వీస్ పొడిగింపు అమలు చేయడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది.
మంగళూరు నుండి రామేశ్వరంకు కొత్త రైలు సర్వీసును కూడా ప్రకటించారు, కానీ అది ఇంకా మొదలుకాలేదు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 30 రైళ్లు రామేశ్వరం వరకు నడుస్తున్నాయి. రామేశ్వరం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయ్యాక మరిన్ని కొత్త రైలు సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంది.