మేడ్చల్ లో దారుణం.. పరికరాల్లేవని మధ్యలోనే ఆపరేషన్ బంద్

మేడ్చల్ లో దారుణం.. పరికరాల్లేవని మధ్యలోనే ఆపరేషన్ బంద్
  •     మెడిసిటీ హాస్పిటల్​లో ఘటన
  •     దవాఖాన ఎదుట  పేషెంట్​ కుటుంబం ఆందోళన

మేడ్చల్, వెలుగు: ఆపరేషన్ మధ్యలో సరైన పరికరాలు లేవంటూ డాక్టర్లు ఓ మహిళకు మధ్యలోనే ట్రీట్​మెంట్​ ఆపేశారు. దీంతో బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అలియాబాద్ గ్రామానికి చెందిన పుష్పలత హెర్నియా సమస్యతో బాధపడుతోంది. పుష్పలత కుటుంబ సభ్యులు ఈ నెల 17న మెడిసిటీ హాస్పిటల్​లో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. 

గురువారం ఆపరేషన్​ ప్రారంభించి సరైన పరికరాలు లేవని మధ్యలోనే ఆపేశారు. పేషెంట్ ను మరో దవాఖానకు వెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో పేషెంట్​ బంధువులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. ఆపరేషన్​ బాధ్యత  మీరే తీసుకోవాలంటూ డిమాండ్​ చేశారు. మేడ్చల్ పోలీసులు జోక్యం చేసుకుని హాస్పిటల్​ యాజమాన్యంతో మాట్లాడి పేషంట్ ను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి పంపించడంతో సమస్య సర్దుమణిగింది.