తిరుమలలో ఆపరేషన్ చిరుత.. 300 కెమెరాలు.. 100 మంది సిబ్బంది

తిరుమలలో ఆపరేషన్ చిరుత.. 300 కెమెరాలు.. 100 మంది సిబ్బంది

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. చిరుతలను బంధించే పనిలో పడింది. ఇందుకోసం ఆపరేషన్ చిరుత స్టార్ట్ చేసింది.తిరుమలలో ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ(ఆగస్టు 17) బోనులో మరో చిరుత చిక్కగా ఇంకా 3 నుంచి 4 చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతల ఆపరేషన్ లో వందమంది అటవీశాఖ సిబ్బంది పాల్గొంటున్నారు.

అడవిలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 200 కెమెరాలను టీటీడీ సమకూర్చనుంది. శ్రీశైలం-నల్లమల నుంచి తిరుపతికి వచ్చిన ప్రత్యేక అటవీ అధికారుల బృందం కెమెరాలను బిగిస్తోంది. త్వరలో శేషాచలానికి మరిన్ని అధునాతన బోన్లు కూడా రానున్నాయి. అటు నంద్యాల నుంచి 10వేల ఊతకర్రలను టీటీడీ తెప్పించనుంది.