‘ఆపరేషన్ సింధూర్’తో సత్తా చాటిన సైన్యం

‘ఆపరేషన్ సింధూర్’తో సత్తా చాటిన సైన్యం
  •     రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: దేశ ప్రజల భద్రత కోసం ఎంతటి సాహసానికైనా భారత్ సిద్ధంగా ఉందని ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రపంచానికి చాటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి జవాబుగా 2025 మేలో భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని బేస్‌ హాస్పిటల్‌లో ‘సింధూర్ మహారక్తదాన్ యాత్ర’ కార్యక్రమం జరిగింది. 

రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ రక్తదానం గొప్ప సేవ అన్నారు. రక్తానికి ఇప్పటికీ కృత్రిమ ప్రత్యామ్నాయం లేదని, అందుకే రక్తదానం ‘ప్రాణదానం’తో సమానమని పేర్కొన్నారు. సుమారు వెయ్యి మంది రెజ్లర్లు, క్రీడాకారులు రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.