Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్.. యుద్ధంలో భారత్ తొలి విజయం.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్.. యుద్ధంలో భారత్ తొలి విజయం.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: ‘ఆపరేషన్ సిందూర్’ గ్రాండ్ సక్సెస్ అయింది. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత యుద్ధ విమానాలు మిస్సైల్స్తో మెరుపు దాడులు చేశాయి. ఒక్క మురిద్కేలోనే 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

జైషే మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. బవహల్పూర్లోని జైషే మహ్మద్ స్థావరంపై భారత యుద్ధ విమానాలు బాంబులేశాయి. భారత సైన్యం చేసిన ఈ మెరుపు దాడుల్లో మొత్తం 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చి పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది.

భారత్‌ టార్గెట్ చేసి ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..
* 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
* సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌
* పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్‌ లష్కరే క్యాంప్‌
* జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌
* అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసిన భారత్‌
* అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్  ప్రధాన కార్యాలయం
* మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌
* సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది  జేఎంకు ఒక క్యాంప్
* అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్‌కోట్ సమీపంలో ఉన్న హెచ్‌ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్
* రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్‌ బిలాల్‌ క్యాంప్‌
* రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌