
వినాయక చవితి వచ్చింది అంటే ముందుగా గుర్తొచ్చేది.. బొజ్జ గణపయ్య బుజ్జి బుజ్జి బొమ్మలే. ఏ ఊరు చూసినా ఆ గణనాయకుడి విగ్రహాలే. వీధివీధినా వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు. అందుకే వినాయక చవితి వచ్చిందంటే వెరైటీ వెరైటీ ఆలోచనలన్నీ బయట పడుతుంటాయి. ట్రెండ్‌కి తగ్గట్టు కూడా వినాయకుడిని మలుస్తుంటారు. బాహుబలి వినాయకుడని..కేజీఎఫ్ ఇలా రకరకాల వినాయకులు దర్శనమిస్తుంటాయి.
హైదరాబాద్ లోని కాచిగూడలో మండపానికి తరలిస్తుండగా విన్నూతంగా S 400 గణనాథుడు దర్శనమిచ్చాడు. ఆర్మీ వెహికల్ ను ప్రధానీ మోదీ డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉన్న ఈ వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. పహల్గామ్ అటాక్ కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్.. పాక్ ను దెబ్బతీయడానికి ఈ S 400 యుద్ధ విమానాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ కు గుర్తుగా S400 వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఘట్ కేసర్ లో ఈ విగ్రహం తయారు చేయించినట్లు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ లో ఎస్ -400
ఎస్ 400 క్షిపణి భారత్ సుదర్శన చక్రంగా గుర్తింపు పొందింది. మనదేశం ఈ క్షిపణి కోసం 2018లో 35 వేల కోట్లతో కొనుగోలు చేసేవిధంగా రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం ఐదు ఎస్ 400 యూనిట్లు కొనుగోలు చేస్తుంది. ఇప్పటివరకు మూడు ఎస్ 400 యూనిట్లు భారత్ లో ఉన్నాయి. మిగతా రెండు 2026కల్లా రానున్నాయి. ప్రతి ఎస్ 400 యూనిట్ ఒకేసారి 160 లక్ష్యాలను ట్రాక్ చేసి 72 లక్ష్యాలపైన దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది.
వీటి పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. అంతేకాకుండా గరిష్టంగా 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగల శక్తి ఉన్నది. ఎస్-400 క్షిపణి లాంచర్లు, శక్తిమంతమైన రాడార్, కమాండ్ సెంటర్ అనే మూడు భాగాలను కలిగి ఉంది. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. ఎస్-400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. దీని రాడార్ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు.