హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశంపై వివిధ సంఘాలు, వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రెండోసారి సమావేశమైంది.
ఉపసంఘం తాజా నిర్ణయం మేరకు ఈ నెల 30 నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సేకరిస్తారు. మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.కిషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి కార్యాలయల్లో ఆఫ్లైన్లోనూ అభిప్రాయాలు తెలియజేయవచ్చు.
అలాగే ఈ మెయిల్ ద్వారా [email protected] కు అభిప్రాయాలు పంపించవచ్చని ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు.
