Oppenheimer Movie OTT: 7 ఆస్కార్స్ గెలిచిన ఓపెన్ హైమర్..3 ఓటీటీల్లో స్ట్రీమింగ్..ఎక్కడంటే?

Oppenheimer Movie OTT: 7 ఆస్కార్స్ గెలిచిన ఓపెన్ హైమర్..3 ఓటీటీల్లో స్ట్రీమింగ్..ఎక్కడంటే?

అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్ హైమర్ మరోసారి సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ హీరో, డైరెక్టర్ సహా ఏడు విభాగాల్లో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమాను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan)తెరకెక్కించారు.

96వ ఆస్కార్ అవార్డ్స్లో మొత్తం 13 నామినేషన్లలో..ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌తోపాటు ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్‌లో ఆస్కార్స్ సాధించిన చిత్రంగా ఓపెన్ హైమర్ నిలిచింది దీంతో ఈ సినిమా చూడాలని ఇండియా సినీ లవర్స్ ఎదురుచూపులు షురూ అయినవి. మరో ఈ హాలీవుడ్ మూవీ ఇప్పటికే పలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, ఇపుడు మరో ఓటీటీలోకి రానుంది.  

2023 జూలై 23న థియేటర్లలో రిలీజైన ఓపెన్ హైమర్ మూవీ..గతేడాది నవంబర్ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ మాత్రం పలు కండిషన్స్ తో స్ట్రీమింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రూ. 149 రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అంటే ఈ సినిమాని చూడాలంటే..రూ.149 చెల్లించి చూడలన్నమాట. అలాగే బుక్ మై షో ఓటీటీలో కూడా రూ.199 చెల్లించి ఓపెన్ హైమర్‌ను చూసి అవకాశం కల్పించింది. 

అయితే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఓపెన్ హైమర్ మరో ఓటీటీలోకి రానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన జియో సినిమా ఓటీటీలో మార్చి 21 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే,ఈ జియో సినిమా ఓటీటీ మాత్రం ఎటువంటి కండిషన్స్ లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాకపోతే, పలు హాలీవుడ్ సినిమాలు చూడాలనుంటే మాత్రం సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి అని తెలుస్తోంది. జియో సినిమా ఓపెన్ హైమర్‌ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.మరి ఆలస్యం ఎందుకు..ఈ సినిమా మరో 10 రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. సుమారు 100 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 మిలియ‌న్ల డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ రాబట్టింది.