V6 News

ఎస్పీ బాలు విగ్రహంపై వ్యతిరేకత సరికాదు..ఏపీలోనూ గద్దర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తం

ఎస్పీ బాలు విగ్రహంపై వ్యతిరేకత సరికాదు..ఏపీలోనూ గద్దర్ విగ్రహ  ఏర్పాటుకు కృషి చేస్తం
  • సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వెల్లడి

బషీర్​బాగ్, వెలుగు: రవీంద్రభారతి ఆవరణలో పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాం ఏర్పాటును కొంత మంది తెలంగాణ వాదులు వ్యతిరేకించడాన్ని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు కుమార చౌదరి యాదవ్ తప్పుబట్టారు. బాలసుబ్రమణ్యం తెలుగు, హిందీ, కన్నడతో పాటు తదితర భాషలకు సంబంధించిన ఆనేక పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల హృదయాలలో నిలిచిపోయారని తెలిపారు. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి అడ్డుకోవడం ధర్మం కాదన్నారు.

 గురువారం హైదర్ గూడ  ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కవులు, కళాకారులు, గాయకులకు కులాలు, మతాలు, ప్రాంతాల బేధం ఉండవని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారని.. కానీ అన్నదమ్ములుగా కలిసే ఉన్నారన్నారు. త్యాగాలు చేసిన వారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎవరైనా కోరవచ్చునని, కాని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్న బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని వద్దని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఏపీలో కూడా ప్రభుత్వంతో మాట్లాడి గద్దర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.