ఆగని ఐటీ లేఆఫ్స్.. 21 వేల మందిని తీసేసిన ఒరాకిల్.. AI ఎఫెక్టే కారణమన్న కంపెనీ

ఆగని ఐటీ లేఆఫ్స్.. 21 వేల మందిని తీసేసిన ఒరాకిల్.. AI ఎఫెక్టే కారణమన్న కంపెనీ

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్ గత 12 నెలల్లో ఏకంగా 21వేల మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ వార్షిక ఆర్థిక నియంత్రణ ఫైలింగ్‌‌‌‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

తమ వ్యాపార కార్యకలాపాలలో ఏఐ టెక్నాలజీలను పెద్ద ఎత్తున అమలు చేయడం, విస్తరించడం వల్లే ఈ స్థాయిలో ఉద్యోగాల కోత విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా ఏఐ విస్తరణ కారణంగా ఉద్యోగాల తగ్గింపు  కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

తాజా లేఆఫ్స్​ తర్వాత మే 31 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 1.62 లక్షలు ఉండేది. 

ఏఐ డేటా సెంటర్లను నిర్మించడానికి ఒరాకిల్ భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చుల వల్ల కంపెనీపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. నగదును ఆదా చేసే వ్యూహంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత విధించింది.