హైదరాబాద్ వస్తూ లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.

హైదరాబాద్ వస్తూ లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.

శుక్రవారం తెల్లవారుజామున 50 మందితో హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. నారాయణపేట - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది బస్సు. మక్తల్ బస్టాండ్ సమీపంలో జరిగింది ఈ ఘటన. తెల్లవారు జామున అదుపు తప్పి బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం ఒకవైపు మొత్తానికి కొట్టుకుపోయింది. 

ప్రమాదం జరిగినపుడు బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వటంతో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు  రాయిచూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన ఘటన జరిగింది.