వాట్సాప్​లో ఆర్డర్లు.. డార్క్ నెట్​లో డ్రగ్స్

వాట్సాప్​లో ఆర్డర్లు.. డార్క్ నెట్​లో డ్రగ్స్
  • కస్టమర్లకు డోర్ డెలివరీ, కొరియర్ సర్వీసులు
  • రూట్ మార్చిన డ్రగ్స్ సప్లయర్లు 
  • నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ నిఘాతో గుట్టురట్టు
  • రెండ్రోజుల క్రితం ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: సిటీలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ సప్లయర్లు రూటు మార్చారు. వాట్సాప్ గ్రూపుల్లో ఆర్డర్లు తీసుకుంటూ, డార్క్ నెట్​లో డ్రగ్స్ కొంటున్నారు. పోలీసులు, ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీమ్ కంటపడకుండా డోర్ డెలివరీలు, కొరియర్ల ద్వారా గుట్టుగా సప్లయ్ చేస్తున్నారు. గంజాయి, హ్యాష్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ బాటిళ్లను కూడా డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ చేస్తున్నారు. ఇటీవల టోలిచౌకిలో డ్రగ్స్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఇద్ద
రిని నార్కొటిక్స్ అధికారులు గురువారం పట్టుకోవడంతో ఈ దందా గుట్టు రట్టయింది. డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు చేసిన మరో నలుగురు యువకులనూ అరెస్ట్ చేశారు.  కూకట్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన తరుణ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడ్డాడు. తాను డ్రగ్స్ వాడటమే కాకుండా ఇతరులకు అమ్మాలని అనుకున్నాడు. డార్క్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీ బ్లాట్స్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్ చేస్తూ అమ్మేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ గ్రూపులోని ప్రగతి నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నలుగురు యువకులతో ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. డార్క్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌లో వాటిని కొన్నాడు.  కానీ డార్క్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లపై నిఘా పెట్టిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నార్కొటిక్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ తరుణ్‌‌‌‌‌‌‌‌ను ట్రాక్ చేసింది. నలుగురు కస్టమర్లతో పాటు మరో అతడిని అరెస్ట్ చేసింది. 

కోడ్ నేమ్స్​తో చాటింగ్ 
సిటీలో కొకైన్‌‌‌‌‌‌‌‌,హెరాయిన్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీ, ఎమ్‌‌‌‌‌‌‌‌డీఎమ్‌‌‌‌‌‌‌‌ఏ, చరస్‌‌‌‌‌‌‌‌కి ఎక్కువగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. దీంతో గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తీసుకునే కస్టమర్లు కూడా సప్లయర్లుగా మారుతున్నారు. తమకు కావలసిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తెప్పించుకోవడంతోపాటు కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇతరులకు  అలవాటు చేస్తున్నారు.    వాట్సాప్​, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్‌‌‌‌‌‌‌‌ గ్రూప్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో డ్రగ్‌‌‌‌‌‌‌‌కి ఒక్కో కోడ్‌‌‌‌‌‌‌‌ పెట్టి చాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. 

పక్కాగా ప్లాన్ 
స్టడీ మెటీరియల్‌‌‌‌‌‌‌‌ పేరుతో కెమికల్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ కోడ్స్‌‌‌‌‌‌‌‌ ను ఉపయోగిస్తున్నారు. మరికొందరు ఫ్రెండ్స్, గేమ్స్‌‌‌‌‌‌‌‌, మూవీస్‌‌‌‌‌‌‌‌ పేర్లతో వాట్సప్‌‌‌‌‌‌‌‌ ప్రొటోకాల్ గ్రూపులు క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. రెగ్యులర్ కస్టమర్లను మాత్రమే యాడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఒక్కో గ్రూపులో 40 మందికి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. డ్రగ్‌‌‌‌‌‌‌‌ పేరు, డెలివరీ టైమ్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ గ్రూపులో మెంబర్ల ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు కనిపించకపోవడాన్ని తమకు అనుకూలంగా చేసుకున్నారు. ఆర్డర్లను బట్టి డార్క్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌లో సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న రేట్లు పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కస్టమర్లకు తమ సోర్సెస్‌‌‌‌‌‌‌‌ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. అనుకున్నన్ని ఆర్డర్లు వచ్చిన తర్వాత డార్క్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌లో కొనుగోలు చేస్తున్నారు. 

కొరియర్ ద్వారా డెలివరీ 
కస్టమర్లకు వాట్సప్‌‌‌‌‌‌‌‌తో కాల్స్ చేస్తున్నారు. దీంతో పాటు వర్చువల్ ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లతో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్‌‌‌‌‌‌‌‌ రీడయల్‌‌‌‌‌‌‌‌ చేసినా మళ్ళీ కనెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం ఉండదు. అలాగే పోలీసులకు చిక్కకుండా కొరియర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ద్వారా డెలివరీ చేస్తున్నారు. గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ప్యాక్ తరహాలో పార్సిల్‌‌‌‌‌‌‌‌ ప్యాక్ చేస్తున్నారు. ఫేక్ అడ్రస్‌‌‌‌‌‌‌‌తో డెలివరీ కావలసిన కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. కస్టమర్లే కొరియర్ సర్వీస్ కు వెళ్ళి పార్సిల్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నాడు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై నిఘా పెరిగిపోవడంతో పెడ్లర్లు, కస్టమర్లు ఇలా కొత్త ఎత్తులు వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి డార్క్‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌లో జరిగే డ్రగ్స్ ఆర్డర్ల డేటాను సేకరిస్తున్నారు.