హస్త కళల..అంగడి షురూ

హస్త కళల..అంగడి షురూ
  •     తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హస్త కళల అంగడి షురూ అయింది. శుక్రవారం బంజారాహిల్స్​లో రాష్ట్ర హ్యాండ్లూమ్స్, టెక్స్​టైల్స్ డైరెక్టర్ అలుగు వర్షిణి ప్రారంభించారు. కార్యక్రమానికి చీఫ్​ గెస్టుగా హాజరైన టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో చేనేత వస్ర్తాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, వస్ర్తాలంటే చాలా మందికి ఆసక్తి ఉంటుందని పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా క్రాఫ్ట్స్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ సభ్యురాలిగా కొనసాగుతున్నానని చెప్పారు.

పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, బెనారస్‌‌ వంటి తరాలనాటి వస్ర్తాలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు ప్రతి ఏడాది హైదరాబాద్‌‌లో ఎగ్జిబిషన్‌‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన అధునాతన డిజైన్లను ఒకే వేదికపైకి తెచ్చి విక్రయాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. రెండు రోజుల పాటు జరుగుతుందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.