ఆపరేషన్ సింధూర్ థీమ్ తో.. అక్టోబర్ 3న అలయ్ బలయ్

ఆపరేషన్ సింధూర్ థీమ్ తో.. అక్టోబర్ 3న అలయ్ బలయ్

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు అద్దం పట్టేలా అక్టోబరు 3న అలయ్ బలయ్ నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. భారత దేశ, కీర్తి ఖ్యాతి సాధించిన ఆపరేషన్ సిందూర్ థీమ్ తో ఈ ప్రోగ్రాం ఉంటుందని... ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబా లను సన్మానిస్తామన్నారు. 

రాజకీయాలకు | అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులతో పాటు మజ్లిస్ పార్టీకి కూడా ఆహ్వానం పంపినట్లు చెప్పారు. అక్టోబర్ 3న  జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి గవర్న ర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, విద్యాసాగర్ రావు, భట్టి విక్రమార్క లతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుంచి కీలక నేతలు రాబోతున్నారని చెప్పారు.