సిటీ గాలితో ఎముకల రోగం

సిటీ గాలితో ఎముకల రోగం

హైదరాబాద్ ను భయపెడుతున్న ఎయిర్ పొల్యూషన్

పొల్యూషన్‌ పెలుసైతున్న బోన్స్‌.. ఫుల్లుగా బాడీ పెయిన్స్‌
ఇవి ఆస్టియోపోరోసిస్‌ లక్షణాలే: స్పెయిన్‌ సైంటిస్టులు
ఇంకో 8 పట్టణాల్లో పొల్యూషన్‌ డేంజర్‌: గ్రీన్‌ పీస్‌ ఇండియా

హైదరాబాద్ లో ఉంటున్నరా? ఈమధ్య బాడీ అలిసి పోయినట్టు అనిపిస్తోందా? జ్వరానికి తోడు బాడీ పెయిన్స్‌ ఎక్కువైతున్నయా ? జ్వరం తగ్గినా నొప్పులు అట్లే ఉంటున్నయా ? నడవలేక మస్తు కష్టమైతందా? దీనికంతటికీ కారణం సిటీల పెరుగుతున్న గాలి కాలుష్యమే. హైదరాబాద్‌, శివారుల్లో ఇటీవల చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాదీలకు ఈ మధ్య బాడీ పెయిన్స్‌ ఎక్కువవడం, మందులేసుకున్నా తగ్గకపోవడంతో స్పెయిన్ కు చెందిన సైంటిస్టుల బృందమొకటి నగర శివార్లలోని ఊర్లల్లో విస్తృతంగా అధ్యయనం చేసింది. 28 గ్రామాలకు చెందిన 3,700 మంది ఎముకల బలం తెలుసుకునేందుకు డ్యూయల్ ఎనర్జీ ఎక్స్ రే అబ్జార్​ప్ షియోమెట్రీ అనే రేడియోగ్రఫీ పరీక్ష చేసింది. ఈ స్టడీలో ఆందోళన కలిగిం చే విషయాలు వెల్లడయ్యాయి . ఎయిర్‌ పొల్యూషన్ తో జనం ఎముకలు బలహీనపడుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. దీని వల్లే హైదరాబాద్, శివారు ప్రాంతాల ప్రజలు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి బారినపడుతున్నారని స్పెయిన్‌‌కు చెందిన బార్సిలోనా ఇన్‌‌స్టిట్యూ ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సైంటిస్ట్‌‌ ఒటావియోరంజనీ తెలిపారు.

శరీరంలోకి ఎట్ల చేరుతది?
సెంట్రల్‌‌ పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు (సీపీసీబీ) ప్రమాణాల ప్రకారం క్యూబిక్‌‌ మీటర్‌‌ గాలిలో పీఎం 10 సూక్ష్మధూళి కణాలు 60 మైక్రోగ్రాములు, డబ్ల్ యూహెచ్‌‌వో స్టాండర్డ్స్‌‌ ప్రకారం 40 మైక్రోగ్రాముల్లోపుంటే జనాలకు ఇబ్బంది ఉండదు. కానీ సీపీసీబీ తాజా లెక్కల్లో హైదరాబాద్‌‌లో ఈ ధూళి కణాలు105 మైక్రోగ్రాములున్నట్టు తెలిసింది. భారీ మోతాదులోని ఈ కాలుష్య కారకాలు శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి వెళ్లి ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో జీవక్రియ ప్రభావితమై కొన్నాళ్లకు ఎముకలు గుల్లబారి పెలుసైపోయి జనం ఆస్టియోపోరోసిస్ బారిన పడతారన్నారు.

హైదరాబాద్‌‌ సహా 8 పట్టణాల్లో
ఇటీవల విడుదలైన గ్రీన్‌‌ పీస్‌‌ ఇండియా రిపోర్టు-2018 ప్రకారం రాష్ట్రంలో 9 నగరాలు, పట్టణాలు తీవ్రంగా కలుషితమైనట్లు వెల్లడైంది. వీటిల్లో గాలిలో సూక్ష్మ ధూళికణాలు (పీఎం 10 ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిం చిన పరిమితి 60 కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌‌లో క్యూబిక్‌‌ మీటర్‌‌ గాలిలో 105 మైక్రోగ్రాములు, రామగుండంలో 104, కొత్తూ రులో 106, కరీంనగర్‌‌లో 98, వరంగల్‌‌లో 85, ఖమ్మంలో 83, పటాన్‌‌చెరు, సంగారెడ్డిల్లో 81, ఆదిలాబాద్‌‌లో 69 మైక్రోగ్రాములు ఉన్నట్లు వెల్లడించింది. నల్గొండ, నిజామాబాద్‌‌ పట్టణాల్లో ఎయిర్‌‌ పొల్యుషన్‌‌ తక్కువున్నట్లు తెలిపింది. రాష్ట్రలో గత మూడేళ్లలో ఎయిర్‌‌ పొల్యుషన్‌‌ 33 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పింది

డాక్టర్లు ఏమంటున్నరు?
కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఎముకలు వీక్ అవుతుంటాయని డాక్టర్లు చెప్పారు. పెద్దవాళ్లు నిత్యం బాడీ పెయిన్స్‌‌తో బాధపడుతూ నడవలేకపోతుంటే ఆస్టియోపోరోసిస్ బారిన పడినట్లు గుర్తించాలన్నారు. వ్యాధిని గుర్తించేం దుకు డెస్కా స్కాన్స్, బోన్ మినరల్ డెన్సి టీ టెస్ట్ చేస్తారని చెప్పారు. తక్కువ, మధ్యరకం, హై రిస్క్‌‌గా వ్యాధిని గుర్తిస్తారన్నారు. బాడీ పెయిన్స్ ఎక్కువున్నోళ్లు ఈ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

మాస్కులు పెట్టు కోవాలి
ఆస్టియోపోరోసిస్‌ కు ఎయిర్ పొల్యూషనే కారణమని తెలుస్తోంది. కానీ రోజూ బయటకు వెళ్లకుండా ప్రజల జీవనం గడవదు. అందుకే పొల్యూషన్‌ బారిన పడుకుండా జాగ్రత్తలు పాటించాలి. 3 ఎంఎం మాస్కులు పెట్టు కోవాలి.
– డాక్టర్ మనోజ్‌ కుమార్, ఆర్థోపెడిక్