ఉస్మానియాలో పెయిన్ క్లినిక్ ప్రారంభం

ఉస్మానియాలో పెయిన్ క్లినిక్ ప్రారంభం
  • ఎన్ఆర్ఐల సహకారంతో ఎక్విప్ మెంట్ల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్  హాస్పిటల్‌‌లో  శనివారం పెయిన్  క్లినిక్ ను ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే మొదటి పెయిన్​ క్లినిక్​ కావడం విశేషం. వివిధ రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఇన్నాళ్లూ ప్రైవేట్  హాస్పిటల్సే దిక్కుగా ఉన్నాయి. ఈ వైద్యం ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద,  మధ్యతరగతి ప్రజలు నొప్పులతో నరకం అనుభవిస్తున్నారు. ఎట్టకేలకు  ఉస్మానియా హాస్పిటల్ లో  పెయిన్  క్లినిక్  అందుబాటులోకి రావడం, లేటెస్ట్  ట్రీట్‌‌మెంట్ ను ఫ్రీగా అందిస్తుండడంతో వారికి ఊరట కలగనుంది.

కాగా, పెయిన్​ క్లినిక్​ ప్రారంభోత్సవానికి డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లినిక్​కు ఎక్విప్​మెంట్​ డొనేట్​ చేసిన డాక్టర్  సురేందర్ సందెల్లా, డాక్టర్  రాం పసుపులేటి, ప్రొఫెసర్  జె.పద్మావతి, చంద్రకళ హరిప్రసాద్, హరిప్రసాద్  గోపీకిషన్, రోగి సహాయ ట్రస్ట్  వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా హాస్పిటల్  సూపరింటెండెంట్  డాక్టర్  రాకేశ్  సాహెయ్, ప్రిన్సిపాల్  డాక్టర్  నరేంద్ర కుమార్,  డాక్టర్ అభిమన్యు సింగ్  తదితరులు పాల్గొన్నారు.