సేఫ్టీ పిన్ మింగాడు : 8 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ

సేఫ్టీ పిన్ మింగాడు : 8 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ

హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హస్పిటల్ లో అరుదైన సర్జరీ చేశారు. గాస్ట్రోఎంటరోలాజి విభాగంలో జరిగిన సర్జరీలో 8 నెలల చిన్నారికి అరుదైన చికిత్స చేశారు డాక్టర్లు. కొండన్నగూడానికి చెందిన చంద్రశేఖర్ ,అనూష దంపతుల కొడుకు  ( ఎనిమిది  నెలల బాబు ) ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు సేఫ్టీ పిన్ ( safetypin open  edged ) మింగాడు.  ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హస్పిటల్ లో చూపించారు. ఎక్స్ రే తీసిన అక్కడి డాక్టర్లు..నీలోఫర్ కు తీసుకెళ్లాలని సూచించారు.

తల్లిదండ్రులు బాబుని తీస్కొని హైదరాబాద్ లోని నిలోఫర్ హస్పిటల్ లో అడ్మిట్ చేశారు. నిలోఫర్ డాక్టర్లు ఎనిమిది నెలల బాబుని ఉస్మానియాలోని స్పెషలిస్ట్ విభాగం అయిన గాస్ట్రోఎంటరోలాజి కి రెఫెర్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఉస్మానియాలోని గాస్ట్రోఎంటరోలాజి విభాగం నేతృత్వంలోని డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాలలోనే ఓపెన్ ఎడ్జెడ్ సేఫ్టీ పిన్ ని తీసివేశారు.  ఎండోస్కోపీ ద్వారా ఫారిన్ బాడీ ని తీసివేయటం పెద్దవాళ్లలో సహజమే.. కానీ ఎనిమిది నెలల పసికందుపై  ఎండోస్కోపీతో  ( open edged safety pin) తీసివేయటం కష్టంమని  ఇది అరుదైన సర్జరీ అని తెలిపారు ఉస్మానియా డాక్టర్లు.