ప్రతిపక్షాల వల్లే ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మించలేదు: తలసాని

ప్రతిపక్షాల వల్లే ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మించలేదు: తలసాని

సీఎం కేసీఆర్ 2015 లో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సందర్శించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అప్పుడే  ఆస్పత్రి పరిస్థితి పై ఒక అంచనాకు వచ్చారని తెలిపారు. 24 బ్లాక్స్ కట్టాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు. ఆస్పత్రిలోకి  వర్షపు నీరు వచ్చిన వెంటనే GHMC,  వాటర్ వర్క్ అధికారులు రౌండ్ ద క్లాక్ పని చేసి పరిస్థితిని చక్కదిద్దారని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ కట్టాలని సీఎం కేసీఆర్ అంటే.. వద్దని అన్న దొంగలే.. ఇవాళ ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన పరిణామాలను హై కోర్టు సుమోట గా పరిగణలోకి తీసుకొని కొన్ని సూచనలు చేయాలన్నారు. దరిద్రమైన ప్రతిపక్షాలకు మంచి ఆలోచన లేనే లేదని ఆరోపించారు. ఇప్పుడు పవిత్రమైన సెక్రటేరియట్ కట్టాలి అంటే… ఇప్పుడు కూడా కట్టొద్దు అంటున్నారని తెలిపారు. చెత్త, దద్దమ్మల మాట వింటే ఇట్లే అవుతుందన్నారు. ఏ మంచి చేసినా ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు.

మరోవైపు బీజేపీ నేతలు ఇక్కడ ఒక డ్రామా, ఢిల్లీ లో మరో డ్రామా ఆడుతున్నారన్నారు మంత్రి తలసాని. ప్రతి పక్షాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చాయని.. అందుకే  తాము ఆస్పత్రి కట్టలేదని స్పష్టం చేశారు.

ఇక సెక్రటేరియట్ కింద గుప్త నిధులున్నాయంటూ ప్రచారం చేస్తున్న వారికి బుద్ది ఉండాలన్నారు. ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ సొంత ఆస్తా… ప్రభుత్వ అస్తి కాదా అని ప్రశ్నించారు తలసాని. కాంగ్రెస్ కు నీతి జాతి లేదన్నారు. కమీషన్ రాదు కాబట్టి హాస్పిటల్ కట్టటం లేదు అంటున్నారన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు దోచుకుంటున్నారు.. కరోనా కు మందులు లేవన్న మంత్రి … ప్రభుత్వ కంట్రోల్ లోనే ప్రైవేట్ హాస్పిటల్స్ వుంటాయన్నారు. సీరియస్ గానే ముందుకు వెళ్తాం.. ప్రైవేట్ హాస్పిటల్ లు ఇబ్బంది పెడితే టోల్ ఫ్రీ నెంబర్ కు  చెప్పాలన్నారు మంత్రి తలసాని .