V6 News

Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ ఎక్స్ పోలో ..ఉస్మానియా కొత్త హాస్పిటల్ మోడల్

Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ ఎక్స్ పోలో ..ఉస్మానియా కొత్త హాస్పిటల్ మోడల్

హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ ఎక్స్పోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మోడల్ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. హైదరాబాద్ గోషామహల్లో ని 26 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. 

మొత్తం 2,700 కోట్లతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్తో పాటు ఒక మెడికల్ కాలేజ్ను కూడా నిర్మాణం చేస్తున్నారు. 32 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో రూపొందుతున్న ఈ నూతన భవనం 2 వేల బెడ్ల కెపాసిటీతో అత్యాధు నిక వైద్య సేవలను అందించనున్నది. 1919లో అప్పటి నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన చారిత్రాత్మక ఉస్మానియా హా స్పిటల్ శిథిలావస్థకు చేరుకోవడంతో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకుగా ప్ర భుత్వం కొత్త హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభిం చింది. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్ లో ఉస్మా నియా హాస్పిటల్ చరిత్ర, అందులో అందించే ట్రీ ట్మెంట్ తో పాటు మెడికల్ కాలేజ్ విషయాలను డెలిగేట్స్కు నిర్వాహకులు వివరిస్తూ మోడల్ను ప్రదర్శించారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.