కార్పొరేషన్‌‌‌‌ పదవుల్లో ఉద్యమకారులకు దక్కని చోటు

కార్పొరేషన్‌‌‌‌ పదవుల్లో ఉద్యమకారులకు దక్కని చోటు

ఓయూ, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఓయూ విద్యార్థులు,ఉద్యమకారులకు చోటు దక్కకపోవడం నిరాశకు గురి చేసిందని ఆదివారం  స్టూడెంట్లు, ఉద్యమకారులు అన్నారు.  ఈ సందర్భంగా ఓయూ ఉద్యమకారులు, స్టూడెంట్లు మాట్లాడుతూ..  కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో  తమకు కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరామన్నారు.  రెండు రోజుల క్రితం ప్రకటించిన 37  మంది జాబితాలో ఒక్క ఓయూ ఉద్యమకారుడు లేకపోవడం బాధాకరమని ఓయూ జేఏసీ నేతలు పేర్కొన్నారు. 

 బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి కాంగ్రెస్‌‌‌‌ కు అనుకూలంగా పనిచేసిన ఓయూ ఉద్యమకారులకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు.  మిగిలి ఉన్న 25 కార్పొరేషన్లలో ఓయూ ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని ఓయూ ఉద్యమకారులు కోట శ్రీనివాస్‌‌‌‌, దుర్గం భాస్కర్‌‌‌‌‌‌‌‌, చనగాని దయాకర్‌‌‌‌‌‌‌‌, డాక్టర్ చారగొండ వెంకటేశ్, బాల లక్ష్మి, లోకేశ్ యాదవ్​, చరణ్​కౌశిక్​ యాదవ్ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ లో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.