ఓయూలో నేటి నుంచి టీవీ పాఠాలు

ఓయూలో నేటి నుంచి టీవీ పాఠాలు

ఓయూ, వెలుగు:  ఉస్మానియా యూనివర్సిటీ  విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రత్యేకంగా ఓ శాటిలైట్​ చానల్ ను అందుబాటులోకి తెచ్చింది.  తెలంగాణ స్కిల్స్, అకాడమీ అండ్ ట్రైనింగ్ టీ-శాట్​తో  ఇటీవల జరిగిన ఒప్పందం ప్రకారం, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్లోని శాటిలైట్ టీవీ నెట్​ వర్క్, ఉస్మానియా టీవీ కోసం ప్రత్యేక లింక్ ఇచ్చారు.  ఓయూ రూపొందించిన ఈ శాటిలైట్​ చానల్​ప్రసారాలు సోమవారం  ప్రారంభం కానున్నాయి. 

చానల్​ అందుబాటులోకి రావడంతో తెలంగాణలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇప్పుడు ఉస్మానియా టీవీతో బోధన, కోర్సు కంటెంట్ ను మరింత క్షుణ్ణంగా  నేర్చుకునే వెసులుబాటు కలుగుతుంది.  శాటిలైట్ టెలివిజన్ ఛానల్ ని  కలిగి ఉన్న దేశంలోనే మొట్టమొదటి సాధారణ వర్సిటీగా నమోదు కానుంది.