జర్నీలో ఎనర్జీ : రైల్వేస్టేషన్లలో మిల్లెట్ స్టాల్స్..

జర్నీలో ఎనర్జీ : రైల్వేస్టేషన్లలో మిల్లెట్ స్టాల్స్..

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన  వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ (OSOP) కాన్సెప్ట్ ను అమలు చేయడంలో  రైల్వే అధికారులు స్పీడ్ పెంచారు.  గంటలు గంటలుగా  ప్రయాణించి అలసిపోయిన ప్రయాణికులకు ఎనర్జీని ఇవ్వడానికి రైల్వేస్టేషన్లో మిల్లెట్స్ ను  అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే   సికింద్రాబాద్, హైదరాబాద్, బేగంపేట, ఈ మూడు రైల్వేస్టేషన్లలో మిల్లెట్ ప్రొడక్ట్స్ స్టాల్స్ ను ప్రారంభించారు అధికారులు.  

సికింద్రాబాద్ స్టేషన్ లోని ప్లాట్ పారమ్ -10లో ఓఎస్ఓపీ కాన్సెప్ట్(ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి) పథకం కింద ఒక  స్టాల్ ప్రారంభించారు.  ఈ స్టాల్ లో మిల్లెట్ తో తయారయ్యే స్వీట్లు, స్నాక్స్ అమ్మనున్నారు.  బేగంపేట ప్లాట్ ఫారమ్- 2లో మిల్లెట్ చిక్కీలను అమ్ముతున్నారు.

హైదరాబాద్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్ లో  ఏన్షియంట్ ఫుడ్స్,  మిల్లెట్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్, స్నాక్స్ లు అమ్ముతున్నారు . మిల్లెట్స్ ఆహారంలో అంతర్భాగం అయినప్పటికీ వీటి వల్ల  అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 

అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023

మినుములపై ​​అవగాహన కల్పించడం, ఉత్పత్తి , వినియోగాన్ని పెంచే లక్ష్యంతో, ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే మిల్లెట్ తో తయారయ్యే ప్రొడక్ట్స్ ను అమ్మకాలను  రైల్వే శాఖ ప్రోత్సహిస్తోంది. 

2022-23 కేంద్ర బడ్జెట్‌లో 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి' అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  దేశవ్యాప్తంగా 535 రైల్వే స్టేషన్‌లను ఎంపిక చేసింది కేంద్రం.  ప్రతి రైల్వే స్టేషన్‌ను ప్రమోషనల్ హబ్‌గా నిర్మించడం, స్థానిక , స్వదేశీ తయారీ ప్రొడక్ట్స్ ను  ప్రదర్శించడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. 

ఈ పథకం పైలట్ ప్రాజెక్టు కింద 2022  మార్చి 25 న ప్రారంభించబడింది. వోకల్ ఫర్ లోకల్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో OSOP పథకం ప్రారంభించబడింది. ఇది స్థానిక తయారీదారులు తమ ప్రొడక్ట్స్ ను అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలోని అట్టడుగు వర్గాలకు అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి ఇదొక అవకాశం. ఈ స్కీం కింద  అర్హులైన దరఖాస్తుదారులందరికీ రొటేషన్  ప్రకారం   స్టాల్  కేటాయిస్తారు.  స్టాల్ కావాలనుకునే వాళ్లు ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లో  రూ.1000 డిపాజిట్ చేయాలి. తర్వాత 15 రోజుల పాటు తాత్కాలిక స్టాల్ కేటాయిస్తారు. 

OSOP స్కీం కింద ఏ ఏ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చంటే?

  • ఆహార పదార్థాలు (సీజనల్ లేదా ప్రాసెస్డ్ లేదా సెమీ ప్రాసెస్డ్ ఫుడ్స్)
  • హస్తకళలు
  • కళాఖండాలు
  • వస్త్రాలు
  • చేనేత వస్త్రాలు
  • సాంప్రదాయ వస్త్రాలు
  • స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు
  • స్థానిక బొమ్మలు
  • తోలు ఉత్పత్తులు
  • స్థానిక రత్నాలు, ఆభరణాలు